తెలంగాణ గడ్డపై మరో అరుదైన పంట.. 14 ఏళ్ల రైతు శ్రమకు ఫలితం...

Rudraksha Cultivation: రైతు శ్రమ ఫలించింది తెలంగాణ నేలపై అద్భుతం ఆవిష్కృతమైంది.

Update: 2022-02-20 06:55 GMT

తెలంగాణ గడ్డపై మరో అరుదైన పంట.. 14 ఏళ్ల రైతు శ్రమకు ఫలితం...

Rudraksha Cultivation: రైతు శ్రమ ఫలించింది తెలంగాణ నేలపై అద్భుతం ఆవిష్కృతమైంది. దశాబ్ద కాలంగా నిపుణుల పర్యవేక్షణలో చేసిన సేద్యం ప్రస్తుతం సత్ఫలితాన్ని అందిస్తోంది. శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే అరుదైన రుద్రాక్ష వృక్షాలు కరీంనగర్ జిల్లాలో ఏపుగా పెరిగాయి. అసాధ్యమనుకున్న సాగు నుంచి ఆశాజనకమైన దిగుబడి అందుతుండటంతో రైతు పంట పండినట్లైంది. కరీంనగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా జరుగుతున్న రుద్రాక్ష సాగుపై ప్రత్యేక కథనం.

రుద్రాక్ష....పరమేశ్వరుడి స్వరూపం. అందుకే రుద్రాక్షలను పరమ పవిత్రంగా భావిస్తారు పవిత్రతను సంతరించుకున్నరుద్రాక్ష వృక్షాల ఎదుగుదలకు శీతల వాతవరణ పరిస్థితులుండే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. థాయిలాండ్ ,నేపాల్ తోపాటు భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో రుద్రాక్ష వృక్షాలు విస్తారంగా కన్పిస్తాయి. ఈ వృక్షాలు మరెక్కడా కనిపించవు. ఈ చెట్లను పెంచేందుకు ఎవ్వరూ సాహసించరు. కానీ తెలంగాణ నేలపై రుద్రాక్ష సేద్యాన్ని సుసాధ్యం చేశాడు ఈ సాగుదారు. కరీంనగర్ జిల్లా న్యాలకొండపల్లికి చెందిన ఆకుల లక్ష్మయ్య ప్రయోగాత్మకంగా చేసిన ఈ రుద్రాక్ష సాగు సత్ఫలితాలనిస్తోంది. రైతు శ్రమకు ఫలితం దక్కుతోంది.

మిత్రుడి సలహాలతో పద్నాలుగేళ్ల క్రితం రుద్రాక్ష మొక్కలను తీసుకొచ్చి పెంచారు. నిపుణుల సూచనలు తీసుకుంటూ సాగు చేశారు. ఇపుడు రుద్రాక్ష వృక్షాలు ఏపుగా పెరిగి విరగ కాశాయి. శీతల ప్రాంతాల్లో మాత్రమే జీవం పోసుకుని మనగలిగే రుద్రాక్ష వృక్షాలు ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో పెరిగి దిగుబడినిస్తున్నాయి. న్యాలకొండపల్లిలో ప్రస్తుతం 30 అడుగుల ఎత్తు పెరిగిన అల్లనేరుడు చెట్ల మాదిరిగా కనిపించే రుద్రాక్ష వృక్షాలను చూసేందుకు చాలా మంది స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.

రుద్రాక్ష చెట్లు, కాయలు ఏవిధంగా ఉంటాయి, ఎండిన తర్వాత ఎలా అవుతాయనే విషయాలు తెలుసుకునేందుకు రైతు పొలాన్ని చూడానికి స్థానిక రైతులు క్యూ కడుతున్నారు. రుద్రాక్ష సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తే స్దానికంగా పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.

Full View


Tags:    

Similar News