రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్‌ 12వ విడత నిధుల విడుదల.. మీ పేరు ఉందోలేదో ఎలా చూడాలంటే?

PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

Update: 2022-10-16 06:04 GMT

రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్‌ 12వ విడత నిధుల విడుదల.. మీ పేరు ఉందోలేదో ఎలా చూడాలంటే?

PM Kisan: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా 12వ విడత నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. రేపు (సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 12వ దశలో మొత్తం 16 వేల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తారు. అలాగే, దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర దుకాణాలను దశలవారీగా వన్‌స్టాప్‌ సెంటర్లుగా మార్చి వాటికి 'పీఎం సమృద్ధి కేంద్రాలు'గా నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు.

ఈ విధంగా మీ ఇన్‌స్టాల్‌మెంట్ తనిఖీ చేయండి

1. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. ఈ వెబ్‌సైట్‌కి కుడి వైపున ఉన్న ఫార్మర్స్ కార్నర్‌పై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీరు బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి.

4. మీ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను అందించాలి.

5. ప్రక్రియ పూర్తయిన తర్వాత జాబితాలో మీ పేరును తనిఖీ చేయవచ్చు.

Tags:    

Similar News