మేడ మీదే బంగారు పంటలు

Update: 2020-09-07 12:22 GMT

పుష్టిగా ఉండే ఆరోగ్యం పౌష్ఠికాహారంతోనే సాధ్యమవుతుంది. కానీ ఇప్పుడు పండుతున్న పంటలలో పోషకాలు తక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న పరిస్థితి, తోడుగా కరోనా వంటి వైరస్ లు మన ఆహారంలో పోషకాల సామర్థ్యానికి పరిక్షగా మారాయి. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇంటి పంటలు రక్షణగా మారుతున్నాయి. ఆ విధంగానే నగరాల్లో కూడా పెరటి, మిద్దెతోటల విస్తరణ పెరుగుతూ వస్తుంది. ఇదే కోవలో hmtv నేలతల్లి మిద్దె తోటల కార్యక్రమాలతో స్పూర్తి పొంది ఇంటిల్లిపాది ఇంటి పంటలు సాగు చేస్తున్నారు హైదరాబాద్ బోడుప్పల్ కి చెందిన ఉషా. కేవలం సాగు చేయడమే కాకుండా ఇంటి పంటనే ఇంటీరియర్ డిజైన్ గా మార్చుకున్న వీరి మిద్దె తోటపై ప్రత్యేక కార్యక్రమం.

చిన్న నాటి నుండి మొక్కల మధ్య పెరిగిన అలవాటు పలు మిద్దె తోట కార్యక్రమాలతో పాటు hmtv నేలతల్లి ఇంటి పంట కథనాలు ఇచ్చిన ప్రేరణ ఇవన్ని నగరానికి చెందిన ఉషకి మిద్దె తోటలు పెంచడానికి కారణమయ్యాయి. చిన్న పూల మొక్కలతో మొదలై అరుదైన ఔషధ మొక్కలు పండిస్తుంది. మొక్కలు పెంచడమే కాదు వాటి సంరక్షణ కూడా అతి ముఖ్యమైన పని, అందులోనూ మొక్కల పాలినేషన్ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం, అప్పుడే ఇంటి పంటల్లో దిగుబడి బాగుంటుంది. అయితే పూల మొక్కలు పెంచడం ద్వారా మిద్దె తోటలకు ఎనలేని లాభాలు కలుగుతాయంటున్నారు నిర్వహకురాలు ఉష. మరి వీరి మిద్దె తోటలోని మరిన్ని విశేషాలు ఆమే మటల్లోనే తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News