Oil Palm Cultivation: పామాయిల్ వైపు ఆ జిల్లా రైతుల చూపు
Palm Oil Cultivation: ఎకరం వరి పండించే నీటితో 4 ఎకరాల్లో ఈ పంటను సాగును చేయవచ్చు.
Oil Palm Cultivation: పామాయిల్ వైపు ఆ జిల్లా రైతుల చూపు
Palm Oil Cultivation: ఎకరం వరి పండించే నీటితో 4 ఎకరాల్లో ఈ పంటను సాగును చేయవచ్చు. అంతర పంటలు పండించుకునే వెసులు బాటు ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందవచ్చు. మార్కెట్ , రవాణా ఇబ్బందులు లేవు. ధర కూడా రైతుకు గిట్టుబాటు అవుతుంది. పంట సాగు చేసే సమయంలో ఎలాంటి వన్యప్రాణులు బెడద ఉండది. ఇంతకి ఏమిటా పంట అని ఆలోచిస్తున్నారా ? ప్రస్తుతం వాడకంలో ఉన్న వంటనూనెలలో మిగతా నూనెల కన్నా తక్కువ ధరలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న వంటనూనె పామాయిల్ .
ఈ పామాయిల్ కు మార్కెట్ లో అత్యధిక డిమాండ్ ఉన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకసారి మొక్క నాటితే 30 సంవత్సరాల వరకు పంట వస్తుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పామాయిల్ సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఔత్సాహికులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. రానున్న కాలంలో జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించే లక్ష్యంతో ఉద్యానాధికారులు ముందుకు సాగుతున్నారు. రైతులకు ప్రత్యేకంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.