Natu Kolla Pempakam: ఇంటి పట్టునే ఉంటూ రూ.40 వేలు సంపాదిస్తున్న మహిళా రైతు

Natu Kolla Pempakam: రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా రైతు.

Update: 2021-08-31 10:04 GMT

Natu Kolla Pempakam: ఇంటి పట్టునే ఉంటూ రూ.40 వేలు సంపాదిస్తున్న మహిళా రైతు

Natu Kolla Pempakam: రైతుకు ఆదాయ భద్రత వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారానే సాధ్యమవుతుందని ఆచరణాత్మకంగా చాటిచెబుతున్నారు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా రైతు. పర్వతగిరి గ్రామానికి చెందని జయంతి మార్కెట్‌ లో ఉన్న గిరాకీని గుర్తించి సేంద్రియ నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించారు. తక్కువ పెట్టుబడి, తక్కు శ్రమతో లాభదాయకమైన ఆదాయాన్ని నాటుకోళ్ల పెంపకం ద్వారా పొందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ మహిళా రైతు. ఇంటిపట్టునే ఉంటూ ప్రతి బ్యాచుకు 40 వేల రూపాయల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు.

వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామానికి చెందిన జయంతి ఓ గృహిణి. తన భర్త ఓ రైతు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరు స్వగ్రామంలోనే తమకుచెందిన మామిడి తోటలో గృహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే పచ్చటి మొక్కల మధ్య ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు. స్వతహాగా జీవాల పెంపకం పైన అవగాహన ఉన్న జయంతి వేడినీళ్లకు చన్నీళ్లుగా తన భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించింది. ఇంటి వద్దే 10 గుంటల భూమిని కోళ్ల పెంపకానికి అనువుగా మార్చుకుని భర్త సహకారంతో చిన్న షెడ్డును నిర్మించుకుంది. ప్రస్తుతం 300 కోడి పిల్లలను పెంచుతోంది ఈ మహిళా రైతు.

నాటుకోళ్లు, పందెంకోళ్లు, అసిల్, కడక్‌నాథ్, వనరాజా ఇలా ఆరు రకాల కోళ్లను పెంచుతోంది జయంతి. ఎక్కువ శ్రమ పడకుండా చాలా సులువుగా నాటుకోళ్లను పెంచుకోవచ్చని చెబుతోంది. ఉదయం పూట సమయానుకూలంగా దాణా, నీరు అందిస్తే సరిపోతుందని చెబుతోంది. ఒక్కో కోడి నాలుగు నెలల సమయంలోనే ఒకటిన్నర నుంచి రెండు కిలోల బరువుకు వస్తోంది. వీటిని స్థానికంగా కేజీ 250 రూపాయలకు అమ్ముతున్నారు ఈ రైతు. చుట్టుపక్కన గ్రామాల రైతులు, చికెన్ సెంటర్ నిర్వాహకులు ఇక్కడికే వచ్చి కోళ్లను కొనుక్కెళ‌్తున్నారు. కోడి గుడ్లు కూడా అదనపు ఆదాయాన్ని అందిస్తాయంటోంది జయంతి.

ఎటువంటి రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులతోనే నాటుకోళ్లను పెంచుతున్నారు. కోళ్లకు సమయానుకూలంగా టీకాలు ఇవ్వడం తప్ప మరే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. పంటలకు హాని చేసే క్రిమికీటకాలే వీటికి ఆహారం అంటున్నారు. మామిడితోటలోనే ఇళ్లు ఏర్పాటు చేసుకున్న జయంతి ఆ తోటలోనే కోళ్లను ఉదయం పూట వదులుతారు. సాయంత్రం చిన్నపాటిగా ఏర్పాటు చేసుకున్న షెడ్డులో వాటిని ఉంచుతారు. ప్రతి 4 నెలలకు ఒక బ్యాచును తీస్తున్నారు. ఒక్కో కోడి కిలోన్నర వరకు బరువు ఉంటుంది. దీంతో చుట్టు పక్కన వారు నేరుగా తమ వద్దకే వచ్చి కోళ్లను కొనుగోలు చేస్తారంటున్నారు ఈ రైతు. ఇప్పటి వరకు కోళ్లకు ఎలాంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు రాలేదంటున్నారు జయంతి. గుడ్ల విక్రయం ద్వారాను అదనపు ఆదాయం పొందుతున్నామంటున్నారు.

చెన్నై, హైదరాబాద్‌ నుంచి ఒక్కో చిక్‌ను 35 రూపాయలకు కొనుగోలు చేసి తీసుకువస్తారు. చిక్స్ వచ్చిన వెంటనే వాటికి అందించాల్సిన టీకాలను ఇస్తారు. సేంద్రియ పద్ధతుల్లోనే నాటుకోళ్లను పెంచుతున్నారు. మరే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. ప్రతి 4 నెలలకు ఒక బ్యాచును తీస్తున్నారు. ఇప్పటి వరకు వాటికి ఎలాంటి జబ్బులు, సీజనల్ వ్యాధులు రాలేదు. పంటలకు హాని చేసే క్రిమికీటకాలే వీటికి ఆహారం. నాటుకోళ్లలో ఎన్నో పోషకాల ఉన్నాయని వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగతుందని జయంతి భర్త అనిల్ చెబుతున్నారు. ప్రతి బ్యాచ్ కి 300 వరకు కోళ్ల ను విక్రయిస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగి మాదిరి 15వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందంటున్నారు అనిల్.

Full View


Tags:    

Similar News