Vegetable Farming: ఉమ్మడి మెదక్ జిల్లా అన్నదాతల కొత్తబాట

Vegetable Farming: ఉద్యాన పంటల సాగు వైపు తెలంగాణ ప్రాంత రైతులు అడుగులు వేస్తున్నారు.

Update: 2021-12-09 10:46 GMT

Vegetable Farming: ఉమ్మడి మెదక్ జిల్లా అన్నదాతల కొత్తబాట

Vegetable Farming: ఉద్యాన పంటల సాగు వైపు తెలంగాణ ప్రాంత రైతులు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌ కు అనుకోని ఉన్న ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో పలువురు రైతులు ఏడాది పొడవునా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తూ ప్రతి నెల నికర ఆదాయాన్ని గడిస్తున్నారు. గతంలో సంప్రదాయ పంటలైన వరి, పత్తి సాగు చేసి నష్టాలను చవిచూసిన ఈ రైతులు. మూడేళ్లుగా కూరగాయలను, ఆకుకూరలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు. మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తూ తక్కువ నీటితో సాగు ఖర్చులను తగ్గించుకూంటూ సేద్యంలో రాణిస్తున్నారు. మెదక్ జిల్లాలో విస్తృతంగా సాగుతున్న కూరగాయల సేద్యంపై ప్రత్యేక కథనం.

వరి నాటేసేటప్పుడు కూలీల కొరత పాలుపోసుకునే దశలో చీడపీడల బెడద కోసేటప్పుడు హార్వెస్టర్‌ ఛార్జీల మోత. చేతికందే సమయంలో అకాల వర్షాలు అమ్ముకుందామంటే కొనుగోలుకేంద్రాల్లో అష్టకష్టాలు ఇకపై యాసంగిలో ధాన్యం కొనబోమని తేల్చి చెబుతున్న ప్రభుత్వాలు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండటంతో అమ్మడం కూడా సులభంగా ఉంటోంది. భిన్నమార్గంలో నడిచి, తొలి దశలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి కాసుల పంట పండించుకుంటున్నారు సాగుదారులు.

మల్చింగ్, డ్రిప్ వంటి ఆధునిక విధానాలను అనుసరిస్తున్నారు రైతులు. పందిర్లను ఏర్పాటు చేసుకుని తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. తద్వారా తక్కువ నీటి వినియోగంతో తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. తీగ జాతి కూరగాయలు కాకర, బీర, చిక్కుడు ఏడాదికి రెండు కాపులు వస్తాయి. ఒక ఎకరా వరి పండించే నీటితో నాలుగు ఎకరాలు కూరగాయలు పండించవచ్చంటున్నారు రైతులు. ఎకరాకు సుమారు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. పత్తి, వరి, కంది పంటలతో పోల్చితే కూరగాయల సాగు లాభసాటిగా ఉందని రైతులు తెలిపారు. చదువుకున్న యువతరం సైతం ఉద్యోగాలు లేక కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రతి నెల ఉద్యోగి మాదిరి ఉపాధి పొందుతున్నారు.

Full View


Tags:    

Similar News