LIC Policy: ప్రతి నెలా రూ. 1300 పొదుపు చేయండి.. 28 లక్షలు సంపాదించండి..!

LIC Policy: ప్రతి నెలా రూ. 1300 పొదుపు చేయండి.. 28 లక్షలు సంపాదించండి..!

Update: 2022-07-12 10:30 GMT

LIC Policy: ప్రతి నెలా రూ. 1300 పొదుపు చేయండి.. 28 లక్షలు సంపాదించండి..!

LIC Policy: ఎల్‌ఐసీ భారతదేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ అన్ని వర్గాల వారికి తగిన విధంగా పాలసీలను ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా ఈరోజు జీవన్‌ ఉమాంగ్‌ అనే పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తును సురక్షితంగా చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రతి నెలా రూ. 1302 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 28 లక్షల వరకు రాబడిని పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

ఎల్‌ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ కింద, మీరు 15, 20, 25 లేదా 30 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. ఇందులో 3 నెలల వయస్సు నుంచి 55 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో లైఫ్ కవర్‌తో పాటు, మెచ్యూరిటీపై ఒకే మొత్తం లభిస్తుంది. 100 సంవత్సరాల వరకు కవరేజీని అందిస్తుంది.

ఈ పాలసీలో ఒక వ్యక్తి ప్రతి నెలా రూ .1302 ప్రీమియం చెల్లిస్తే ఏడాదిలో ఆ మొత్తం రూ .15,298 అవుతుంది. ఈ పాలసీని 30 సంవత్సరాల తరువాత అమలు చేస్తే నికర మొత్తం రూ .4.58 లక్షలు అవుతుంది. మీ పెట్టుబడిపై 31 వ సంవత్సరం నుంచి కంపెనీ ప్రతి సంవత్సరం 40 వేల రాబడిని అందిస్తుంది. మీరు 31 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఏటా 40 వేల రిటర్న్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు సుమారు రూ .27.60 లక్షలు లభిస్తాయి.పెన్షన్ తీసుకోవాలనుకునే వారికి, మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు పెద్ద మొత్తంలో అందించాలనే వారికి ఈ పాలసీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

Tags:    

Similar News