KCR scheme for farmers: రైతన్నలకు కేసీఅర్ చెప్పిన కొత్త పథకం ఎప్పుడో ?

KCR scheme for farmers: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారన్న కొత్త రైతు పథకం ఏంటానే దానిపై సర్వత్రా ఉత్కఠత రేపుతోంది

Update: 2020-06-30 16:44 GMT

KCR scheme for farmers: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారన్న కొత్త రైతు పథకం ఏంటానే దానిపై సర్వత్రా ఉత్కఠత రేపుతోంది. వారం రోజుల్లో ప్రకటన అంటూ చెప్పి ఇప్పుడు ఎందుకని ఆలస్యం అవుతుంది..? ఇప్పటికే వ్యవసాయానికి అనేక రకాల స్కీములు ప్రవేశపెట్టిన రాష్ర్ట ప్రభుత్వం అదనంగా ఇంకేం చేయబోతుంది..? కేసీఆర్ కొత్త స్కీమ్ పై ఇంకా ఎన్ని రోజులు సస్పెన్స్ కొనసాగుతుంది..?

గత నెల 29వ తేదీన కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా వారం రోజుల్లో రైతులకు తీపికబురు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. దేశం ఆశ్చర్యపోయేలా ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కొత్త స్కీమ్ ని రైతుల కోసం ఆవిష్కరిస్తున్న ట్లు చెప్పారు. దీంతో సీఎం ప్రకటన ఏమై ఉంటుందని అటు రైతులు, ఇటు రాజకీయ నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలను తానే స్వయంగా వారం రోజుల్లో చెప్తాను అంటూ కేసీఆర్ ప్రకటించారు. అయితే దాని కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో ఏ పథకం ప్రవేశపెట్టినా కేసీఆర్ తనదైన మార్క్ ఉండేలా ప్లాన్ చేస్తారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. రైతు బంధు, రైతు భీమా, కేసీఆర్ కిట్స్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కొన్ని స్కీమ్ లను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి. రైతుబంధు లాంటి స్కీమ్ ని కేంద్రం కూడా అనుసరించింది. అయితే కేసీఆర్ కొత్తగా ఏ పథకం తీసుకొస్తారానే దానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. 45 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ స్కీమ్ ప్రవేశపెడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఉన్న లెక్కల ప్రకారం 30 నుంచి 35 లక్షల మంది రైతులు 45 సంవత్సరాల పైబడి ఉన్నారు. వారందరికీ ప్రతి నెలా ఐదు వేల చొప్పున ఇస్తే ప్రతి ఏటా రెండు వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇక పనికి ఆహార పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేంద్రాన్ని ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీని ద్వారా రైతాంగానికి భారీగా కూలీల ఖర్చు తగ్గుతుంది. మరోవైపు వ్యవసాయ కూలీలకు 365 రోజులు పని దొరుకుతుంది. కానీ, కేంద్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. ఇక పంటలకు మద్దతు ధర భారీగా పెంచడం మరో అంశం. ఇది కేంద్రం పరిధిలో ఉన్నా రాష్ట్రం కొంత మద్దతు ధరను జత పరుస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ఇప్పటికే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సాగునీరు అందుబాటులోకి తెచ్చారు సీఎం కేసీఆర్. పెట్టుబడికి డబ్బు ఇస్తూనే రైతు భీమా కూడా అమలు చేస్తున్నారు. ఇక రైతులకు మరింత ప్రోత్సాహం ఏ రకంగా అందించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కేసీఆర్ పథకం దేశంతో పాటు ప్రప్రంచం అశ్చర్యపోయోలా ఉంటుందన్న చర్చ అన్న వర్గాల్లో నడుస్తోంది. 

Tags:    

Similar News