Rose Farming: పూల సాగులో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా రైతు

Rose Farming: వాణిజ్యపరంగా బయటి ప్రదేశాలలో, పాలీహౌజ్‌లలో సాగు చేసుకునే బహువార్షిక పంట గులాబీ.

Update: 2022-02-21 11:30 GMT

Rose Farming: పూల సాగులో రాణిస్తున్న సిద్దిపేట జిల్లా రైతు

Rose Farming: వాణిజ్యపరంగా బయటి ప్రదేశాలలో, పాలీహౌజ్‌లలో సాగు చేసుకునే బహువార్షిక పంట గులాబీ. దేవుడి పూజకైనా..ఏ శుభకార్యానికైనా గులాబీ పూలను విరివిగా వినియోగిస్తారు. అందుకే పూవ్వుల్లో రారాణి అయిన గులాబీ సాగుకు రైతులు ఆసక్తి చూపుతుపన్నారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు సంప్రదాయ పంటల సాగును వీడి గులాబీ సాగుకు శ్రీకారం చుట్టాడు. విరుల సాగులో లాభాలను ఆర్జిస్తున్నాడు.

సిద్ధిపేట జిల్లా తొగుట మండలం ఎల్లరావు పేట గ్రామానికి చెందిన శ్రీమాన్ సంప్రదాయ పంటలను వీడి పూల సాగుకు శ్రీకారం చుట్టాడు. సంప్రదాయ పంటల సాగులో పెట్టుబడులు పెరగడం, లాభాలు పెద్దగా లేకపోవడం గమనించిన ఈ రైతు ఎకరం విస్తీర్ణంలో గులాబీ సాగు చేపట్టాడు. స్థానికంగా పూల సాగు లేకపోవడం మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉండటంతో సాగు రైతుకు కలసి వస్తోంది. డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తూ ఆధునిక సేద్యపు విధానాలను అనుసరిస్తున్న శ్రీమాన్ మంచి పూల దిగుబడిని పొందుతున్నాడు. సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నాడు.

ఏడాది కాలంగా గులాబీ సాగు చేస్తున్నాడు శ్రీమాన్. మొక్కలు నాటిన 6 నెలలకు పూల కోత ప్రారంభమైంది. మొదటి కోతలో 14 కేజీల పూల దిగుబడి అందిందని రైతు తెలిపాడు. రెండో కోతలో 25 కేజీల వరకు పూల దిగుబడి అందనుంది. ప్రస్తుతం పెళ్లిల్ల సీజన్ కావడంతో పూల సాగు బాగుందని తెలిపాడు. రైతు సాగు చేస్తున్న బుల్లెట్టు గులాబీ రకానికి మార్కెట్‌లో 350 రూపాయల వరకు ధర పలుకుతోంది. సీజన్‌ను బట్టి ధర పెరిగే అవకాశం ఉందంటున్నాడు శ్రీమాన్. గులాబీలో అంతర పంటగా బంతి సాగు చేస్తున్నాడు. బంతి పూల ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని చెబుతున్నాడు ఈ సాగుదారు.

Full View


Tags:    

Similar News