Young Farmers: సేద్యంలో రాణిస్తున్న కరీంనగర్ యువరైతులు

Young Farmers: కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ వెన్నువంచి, స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్నారు సాగుదారులు.

Update: 2021-06-07 08:18 GMT

Young Farmers: సేద్యంలో రాణిస్తున్న కరీంనగర్ యువరైతులు



Young Farmers: కరోనా వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ వెన్నువంచి, స్వేదం చిందిస్తూ సేద్యం చేస్తున్నారు సాగుదారులు. లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని రంగాల కార్యకలాపాలు స్తంభించినా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు మాత్రం నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సేద్యంలో రాణించాలనే ఉద్దేశంతో యువరైతులు సైతం వినూత్న విధానాలను అందిపుచ్చుకుని సాగువైపు అడుగులు వేస్తున్నారు. కరీంనగర్ కు చెందిన యువరైతులు సైతులు సైతం వ్యాపారం వద్దని సేద్యమే ముద్దని నేలతల్లిని నమ్ముకున్నారు. తమకున్న 20 ఎకరాల వ్యవసాయ భూమిలో విభిన్న పంటలు పండిస్తూ సాగులో రాణిస్తున్నారు. లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న అన్నదమ్ముల సేద్యంపై ప్రత్యేక కథనం.

పచ్చటి పొలాల మధ్య కాలం గడుపుతున్న ఈ యువ రైతులు శ్రీనివాస్ రెడ్డి, నరసింహారెడ్డిలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల వీరి స్వగ్రామం. ఈ ఇద్దరు అన్నదమ్ములు అందరు యువకుల్లా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించారు. అందరు యువకుల్లో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లకుండా సేద్యంపై మక్కువ పెంచుకుని పంటల సాగు చేపట్టారు. తొలుత వ్యాపారం చేసి స్థిరపడదామనుకున్నా తమ తాతముత్తాల నుంచి వస్తున్న వ్యవసాయాన్ని వీడొద్దని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తోటి రైతులకు భిన్నంగా విభిన్న రకాల పంటలు సాగు చేస్తూ సాగులో రాణిస్తున్నారు.

అందరి లాగా వరి పత్తి, మొక్కజొన్న, వంటి సంప్రదాయ పంటలు పండించడం లేదు. అందులో పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు లేదన్న విషయాన్ని గుర్తించిన ఈ యువరైతులు ఏడాది పొడవునా ఆదాయం వచ్చే పంటలను పండించాలనుకున్నారు. దీంతో తమకున్న 20 ఎకరాల్లో కూరగాయలను పండిస్తున్నారు ఈ యువరైతులు. అందులోనూ ఆధునిక విధానాలను అవలంభిస్తున్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

స్టేకింగ్ విధానంలో 15 ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో కాకర, బీర వేసుకున్నారు. అందులో కర్బూజ అంతర పంటగా సాగు చేస్తున్నారు. కలుపు సమస్యను నివారించేందుకు మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. కాయ నాణ్యతను దిగుబడిని పెంచుకునేందకు పందిళ్లను ఏర్పాటు చేసుకున్నారు. డ్రిప్ ద్వారానే పంటకు నీటిని సరఫరా చేసున్నారు. వేసవి సీజన్ లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉంటుంది కానీ కరోనా వల్ల మార్కెట్ ఉండటం లేదంటున్నారు ఈ యువరైతులు. ప్రభుత్వం చేయూత నివ్వాలని కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News