అన్నదాతలకి అలర్ట్‌.. వ్యవసాయ రుణాలు, సబ్సిడీలపై పరిస్థితి ఏ విధంగా ఉందంటే..?

Agriculture News: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Update: 2023-01-22 10:30 GMT

అన్నదాతలకి అలర్ట్‌.. వ్యవసాయ రుణాలు, సబ్సిడీలపై పరిస్థితి ఏ విధంగా ఉందంటే..?

Agriculture News: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులను తయారు చేస్తున్న రైతులు , కంపెనీలు ఈ బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తమ కోసం ఏదైనా ప్రత్యేక పథకాన్ని తీసుకువస్తుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు. కనీసం పంటల సబ్సిడీ అయినా పెంచాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వమే మాట్లాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌పై రైతుల అంచనాలు నిజమవుతాయో లేదో వేచిచూడాలి.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం తమపై దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు. ఎరువులు, వ్యవసాయ రసాయనాలపై కేంద్రం అధిక ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించాలని తద్వారా గరిష్ట లాభంతో పాటు ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో పశుసంవర్ధక, మత్స్య, కోళ్ల పెంపకంతో సంబంధం ఉన్నవారు కూడా ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. పశుసంవర్ధక, మత్స్య, పౌల్ట్రీ రంగానికి తక్కువ ధరకు రుణాలు అందించాలని కోరుతున్నారు. దీంతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని కొందరు కోరుతున్నారు. వ్యవసాయ రసాయనాలు, ఎరువులు వంటి వ్యవసాయ-ఇన్‌పుట్ రంగం లాభపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం గృహాలను దెబ్బతీస్తోంది. వేతనాలు పడిపోయాయి. ఈ రెండు గ్రామీణులని బాగా ఇబ్బందిపెడుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసేందుకు రానున్న బడ్జెట్‌లో వ్యవసాయంపై దృష్టి పెట్టాలని అందరు కోరుతున్నారు.

Tags:    

Similar News