వేసవి దుక్కులు రెడీ!

Update: 2020-05-21 09:01 GMT

ఏరువాక పౌర్ణమికి ముందే వరుణుడు పలుకరించాడు. అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కేవలం వర్శాలపై ఆధారపడి సాగు చేసుకుంటున్న సీమ రైతులు ముందస్తు సేద్యానికి సిద్ధమయ్యారు. పంట సాగే జీవనాధారం చేసుకున్న అన్నదాతలు దుక్కులు దున్ని విత్తనం నాటేందుకు అడుగులు వేస్తున్నారు.

ఏరువాక పౌర్ణమిని రైతుల పండుగగా జరుపుకోవడం ఆనవాయితీ..అప్పుడే తొలకరితో వరుణుడు పలుకరిస్తుంటాడు. కానీ గతానికి భిన్నంగా ఈ ఏడాది ఎండాకాలం ముగియక ముందే వానలు పడటంతో అన్నదాతలు ఆనందంతో పొలంబాట పట్టారు. ఖరీఫ్ పంట సాగు ప్రారంభంలోనే వరుణుడు పలుకరించడంతో సీమ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దుక్కులు దున్ని విత్తనం నాటేందుకు సిద్ధమయ్యారు.

రాయలసీమ ముఖద్వారాం కర్నూలు జిల్లా పడమర ప్రాంతం కేవలం వర్షాలపై ఆధారపడి సాగుచేసుకుంటారు. కరువు సీమగా ముద్రపడిన రాయలసీమలో సరైన వర్షాలులేకపోవడంతో ఈ ప్రాంతానికి చెందిన రైతులు మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది వేసవి కాలం ముగియక ముందే వర్షాలు పడటంతో ఈ ప్రాంత రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోహిణి కార్తె రాక ముందే వర్షాలు కురవడంతో పత్తి, వేరుశనగ, సద్దులు, కందులు విత్తనాలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.

గత ఏడాది ఖరీఫ్ సాగుకు కర్నూలు జిల్లాలో వేల హెక్టార్లో వివిధ పంటలు సాగు చేశారు. అయితే ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడటంతో పంట సాగు చేసే విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వేరుశనగ, పత్తిపంటలపై రైతులు మక్కువ చూపుతున్నారు. అలాగే ఉల్లి, మిరప, టమోటా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనాలతో అన్నదాతలకు అండగా వ్యవసాయ శాఖ సన్నద్దమవుతుంది. ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు ఇతర ఉపకరణాలు సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మంచి పంట దిగుబడిని అందించి గిట్టుబాటు ధర లభించాలని అంతా కోరుకుంటున్నారు. 


Full View


Tags:    

Similar News