కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు.. రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోండి

Update: 2019-05-16 16:22 GMT

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతుబీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేవారు 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారై ఉండాలి. కొత్త పట్టాపాస్ పుస్తకం లేదా ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టా కలిగి ఉన్నవారు రైతులు తమ వద్ద ఉన్న ఆధారాల నకలు కాపీలను కార్యాలయంలో అందజేయాలి. నామిని పేరు, వారికి సంబంధించిన ఆధారాలను కచ్చితంగా దరఖాస్తుతో జతచేయాలి. రైతుబీమా చేయించుకునేందుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రైతు అనుకోని పరిస్థితిలో మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం నామినీకి 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది అధికారులు తెలిపారు.

Full View 

Similar News