అడవి పందుల గుండేల్లో దడపుట్టిస్తున్న యంత్రం

Update: 2019-09-02 12:05 GMT

ఆ జంతువులు రైతులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. దివీటీలతో రాత్రి పగలు కాపలా కాసిన. విద్యుత్ ఉచ్చులతో ఉచ్చు బిగించినా వాటి విద్వాంస కాండకు అడ్డు అదుపు లేదు. వేల రుపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి. అయితే అలాంటి అడవి పందులను పారద్రోలడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు విన్నూత యంత్రాన్ని రూపోందించాడు. అడవి పందుల గుండేల్లో దడపుట్టిస్తున్నా యంత్రం పై స్పెషల్ రిపోర్ట్.

ఆదిలాబాద్ జిల్లా సిరికొండకు చెందిన రైతు మల్లేషం ఆలోచన ఆదిరింది. ఆరు గాలం కష్టించి పండించిన పంటను కాపాడుకునేందుకు సృష్టించిన పరికరం సత్పలితాలిస్తుంది. అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు కనిపెట్టిన ఈ పరికరం రైతుకు అండగా నిలుస్తుంది.

అడవి పందుల భారీ నుంచి ఎలాగైనా పంట కాపాడుకోవాలని వచ్చిన ఆలోచనకు పదును పెట్టాడు రైతు మల్లేష్. పాడైపోయిన కూలర్ ఫ్యాన్, సైకిల్ బేరింగ్, ఒక ప్లేట్ ఒక పరికరాన్ని రూపొందించాడు. కూలర్ ఫ్యాన్ ను సైకిల్ బేరింగ్ కు అమర్చి రెండు ఇనుప చువ్వలు వెల్డింగ్ చేయించాడు. ఆ చువ్వల కింద ప్లేట్ ఉంచాడు. ఈ పరికరాన్ని పది ఫీట్ల ఎత్తున్న కర్రకు పత్తి చేను మద్యలో అమర్చాడు. గాలితో ఆ ప్యాన్ తిరగడం వల్ల ప్లెట్ కు ఇనుప చువ్వలు తగిలి ఘన ఘనమంటూ శబ్దం వస్తుంది. వింతైనా శబ్దం రావడంతో పందులు అటువైపు కన్నేత్తి చూడటం లేదు. ఎలాంటి ఖర్చు లేకుండానే అమర్చుకున్న ఈ యంత్రంతో పందుల బెడద లేకుండా పోయిందని చెబుతున్నాడు రైతు మల్లేషం.

నిరంతరాయంగా శబ్దాలు చేయడంతో పంటపొలాల్లో అడవి పందుల బెడద లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అగని పందుల బెడద ఈ శబ్దాలతో తగ్గడం గ్రామంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రైతులు సైతం మల్లేషం తయారు చేసిన పరికరాన్ని తయారు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. రైతు మల్లేషం అవిష్కరణ చిన్నదైనా వేల రుపాయల పంటలు కాపాడుకోవడానికి ఆ యంత్రం అద్బుతమైన మంత్రంగా పని చేస్తుందని పలువురు కొనియాడుతున్నారు.

Full View

Similar News