పుట్టిన రోజు బహుమానం... రైతన్నకు వరం!!

పుట్టిన రోజు వచ్చిందంటే చాలు కేక కట్టింగ్‌లంటూ ,పార్టీలంటూ అనవసరపు ఖర్చులు అతిగా చేస్తుంటారు చాలామంది.

Update: 2019-01-10 07:46 GMT
Farmer

పుట్టిన రోజు వచ్చిందంటే చాలు కేక కట్టింగ్‌లంటూ ,పార్టీలంటూ అనవసరపు ఖర్చులు అతిగా చేస్తుంటారు చాలామంది. అయితే ఈ మధ్య పెరిగిన సామజిక స్పృహ వల్ల పుట్టినరోజు వేడుకలకు అయ్యే ఖర్చుతో సామాజిక సేవ చేయాలనుకున్నారు నిజామాబాద్‌కు చెందిన ఓ యువరైతు. తన కూతురి పుట్టిన రోజు వేడుక సందర్భంగా పేద కౌలు రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. రసాయనిక సేద్యం వద్దూ..ప్రకృతి వ్యవసాయమే ముద్ద అని ఎరువులను పంపిణీ చేస్తూ రైతుల్లో ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన పెంచుతున్నారు...ఆ వివరాలు మీకోసం.

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ కన్వీనర్ రవీందర్ రైతే రక్షతి రక్షతః అని వినూత్నంగా తన కూతురు పుట్టినరోజు వేడుకలను నిర్వహించాడు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లా మండలం తొర్తి గ్రామంలో రవీందర్ తన కూతురు మహతి పుట్టినరోజు సందర్భంగా కౌలు రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. అంతేకాదు..కేకులకు బదులుగా కౌలు రైతులకు సేంద్రియ ఎరువులను కూతురి చేతుల మీదుగా ఉచితంగా కౌలు రైతులకు అందజేసారు.

రసాయనిక సేద్యంలో పొంచివున్న ప్రమాదాలను రైతులకు ఈ సందర్భంగా వివరించారు రవీందర్..తాను ఆర్గానిక్ వ్యవసాయం చేయడమే కాకుండా తన సంస్థ ద్వారా సదస్సులను నిర్వహిస్తూ ఇప్పటికే ఎంతోమంది రైతులకు ఆర్గానిక్ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు.

Full View

Similar News