Coronavirus Effect: మామిడి రైతుల ఆశలపై నీళ్లు

Coronavirus Effect: మొదట్లో మామిడి ధరకు రెక్కలచ్చాయి. కిలో మామిడి పండ్ల ధర వందకు పై మాటే ఇక మామిడి రైతులు తెగ సంబరపడ్డారు.

Update: 2021-05-13 09:28 GMT

Coronavirus Effect: మామిడి రైతుల ఆశలపై నీళ్లు

Coronavirus Effect: మొదట్లో మామిడి ధరకు రెక్కలచ్చాయి. కిలో మామిడి పండ్ల ధర వందకు పై మాటే ఇక మామిడి రైతులు తెగ సంబరపడ్డారు. గత ఏడాది నష్టాలను కూడా పూడ్చేస్తామని ఆశలు పెంచుకున్నారు. కానీ కరోనా ఈ ఏడాది కూడా మామిడి రైతులను వదిలిపెట్టలేదు. కట్‌ చేస్తే ఎగుమతులు ఆగిపోయాయి. ధరలు తగ్గిపోయాయి. ఇప్పుడు మామిడి రైతులు అమ్ముడుపోక, ధరలు లేక ఆవేదన చెందుతున్నారు.

ఈ సారి మామిడి పంట బాగానే వచ్చింది. పైగా తొలి రోజుల్లో బంగినపల్లి రకం టన్ను ధర రూ 60వేల నుంచి రూ లక్ష వరకు పలికింది. ఇక డోకా లేదని మామిడి రైతులు సంబురపడ్డారు. కానీ రైతుల ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో సుమారు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈసారి పంట బాగానే వచ్చింది. ఇటు రేట్‌ కూడా ఆశించిన రేంజ్‌లో పలికింది. గిట్టుబాటు అవుతుందని మామిడి రైతులు ఆశపడ్డారు. కానీ మాయదారి కరోనా వారి ఆశయాలను అడియాశలు చేసింది.

చింతలపూడి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మామిడి వ్యాపారం జోరుగా సాగేది. స్థానికంగా ఉన్న తోటలతో పాటు రాష్ట్ర సరిహద్దులోని తెలంగాణ ప్రాంత గ్రామాలైన దమ్మపేట, అశ్వారావుపేట నుంచి కూడా మార్కెట్‌కు తరలిస్తుంటారు. ఇక్కడి నుంచి వ్యాపారులు గుజరాత్‌, మహారాష్ట్రకు ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉండడంతో వ్యాపారులు సైలెంట్‌ అయ్యారు. గతంతో పోల్చితే మార్కెట్‌లో దుకాణాలు కూడా తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌కు మాత్రం కొంత ఎగుమతి చేస్తున్నారు.

ప్రస్తుతం బంగినపల్లి రకం టన్ను ధర రూ 20 వేల నుంచి 40 వేల వరకు పలుకుతోంది. కోత ఖర్చులు, ప్యాకింగ్, కమీషన్, రవాణ, కిరాయి ఖర్చులు టన్నుకు రూ15 వేల వరకు అవుతున్నాయని రైతులు అంటున్నారు. ధరలు పెరిగితే తప్పా తమకు లాభాలు రావాని రైతులు చెబుతున్నారు.

Full View


Tags:    

Similar News