Corn Farmers : ఖమ్మం జిల్లాలో రైతులను వెంటాడుతున్న కష్టాలు

Update: 2020-07-13 11:21 GMT

Corn Farmers : గవర్నమెంటు మద్దతు ధరతో మేలు జరిగిందని ఆశపడ్డారు. కానీ అకౌంట్లో పడిన అమౌంట్‌ చూసి తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని ఎవరిని వేడుకున్న ఫలితందక్కలేదు. తమ కష్టాన్ని గుర్తించి ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరతున్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిర, ఇల్లందు, వైరా నియోజకవర్గంతో పాటు, పలుప్రాంతాల మొక్కజొన్న రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్క జొన్నలు కాటా వేసి దగ్గర్నుంచి లోడింగ్ అయ్యేవరకు ప్రతీ దానిలో సాకుగా చూపిచి అన్నదాతలను దోచుకున్నారు. దళారుల నుంచి బయటపడ్డం అనుకున్న రైతులకు ప్రభుత్వం నిరాశ మిగిలించింది.

మార్క్ఫెడ్, డీసీఎంఎస్, డీఆర్డీఏ శాఖల ద్వారా మునుపెన్నడూ లేనివిధంగా అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సర్కారు హామీలు నమ్మిన చాలా మంది రైతులు మార్క్ ఫెడ్, పౌర సరఫరాల శాఖలకే పంట ఉత్పత్తులు విక్రయించారు. ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాలో జమా అవుతున్న అమౌంట్‌ చూసి రైతులు లబోదిబోమంటున్నారు.

సరుకు మిల్లుకు చేరాక నాణ్యతలేమి, తడిసిందనే కారణంతో తూకంలో కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయించిన ఉత్పత్తులను బట్టి ఒక్కొక్కరు 1500 రూపాయల నుంచి 2000 వేల వరకు నష్టపోయారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బండి పడుతున్ను రైతులను మరింత ఇబ్బందులకు గురిచేయడం తగదని పలువురు రాజకీయనేతలు, రైతుల నేతుల ‍హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు జరిగిన అన్యాయన్ని గుర్తించి న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News