Terrace Gardening: కాంక్రీట్ అరణ్యంలోనూ పంటలు పండించవచ్చు

Terrace Gardening: మహానగరంలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెనవేసుకుంది.

Update: 2021-07-19 11:28 GMT

Terrace Gardening: కాంక్రీట్ అరణ్యంలోనూ పంటలు పండించవచ్చు

Terrace Gardening: మహానగరంలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెనవేసుకుంది. ఇక పంటలు పండించడానికి స్థలం ఎక్కడుంది? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. కానీ అలాంటి అపార్ట్‌మెంట్‌పై ఖాళీగా ఉన్న స్థలాన్ని కొంగొత్త సొగసులతో మిద్దె సాగుకు అనుకూలంగా మార్చుకున్నారు కొండాపూర్ కి చెందిన రవి, నీలిమ దంపతులు. మిద్దె సాగుదారుడైన రవి వృత్తిరిత్యా సివిల్ ఇంజనీర్. టెర్రెస్ గార్డెన్ ఏర్పాటు చేయాలనే ఆసక్తితో తన మేడను ఓ ఉద్యాన క్షేత్రంగా మార్చుకున్నాడు. ఎత్తు మడుల పద్ధతిలో చూడచక్కగా తీర్చిదిద్దుకున్న ఈ మిద్దెవనం ఆరోగ్యకర పంటల సాగుకు క్షేత్రంగా మారింది.

కొందరికి మిద్దె తోటలంటే చెప్పలేనంత ఇష్టముంటుంది. మొక్కలంటే ఎనలేని ప్రేమ చూపిస్తారు వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అటువంటి వారు మేడపై శాశ్వత నిర్మాణాలను ఏర్పాడు చేసుకోవాలనుకుంటే రైజ్డ్ బెడ్స్ పద్ధతిని ఎంచుకోవడం మేలంటున్నారు రవి. ముఖ్యంగా సొంతిళ్లు ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా బెడ్స్ వేసుకోవచ్చని సూచిస్తున్నారు.

మిద్దె తోటలో మొక్కల పెంపకానికి రైజ్డ్ బెడ్స్‌తో పాటు, స్టాండ్లు, డ్రమ్మలనూ ఉపయోగిస్తున్నారు. ఇందులో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తీగజాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మిద్దెతోటల నుంచి ఉత్పత్తైన కూరగాయలను వీరు మాత్రమే కాదు అపార్ట్‌మెంట్ వాసులకు అందిస్తున్నారు. నలుగురికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు.

తక్కువ స్థలం, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని అందించే ఈ పద్ధతిపై ప్రతి ఒక్కరు దృష్టి సారించాలంటున్నారు ఈ మిద్దె సాగుదారు. రోజుకు నాలుగైదు గంటలు సూర్యరశ్మీ పడే అవకాశముండే బాల్కానీలోనో, టెర్రస్‌లోనో లేదా మరెక్కడైనా ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఎంచక్కా కూరగాయాలు, ఆకుకూరల తోటలను ఏర్పాటు చేసుకోవచ్చునని రవి అంటున్నారు. అతి తక్కువ ఖర్చుతో సులువైన పద్ధతుల్లో సేంద్రియ విధానంలో మిద్దె తోటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. మరి ఇలాంటి పద్ధతులను మీరు అనుసరించి అందమైన మిద్దె వనాలను ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాము.

Full View


Tags:    

Similar News