రైతులకి బంపర్ ఆఫర్.. ఈ స్కీంలో 3 లక్షల ప్రయోజనం..!

Pashu Kisan Credit Card: రైతులకు ఇది శుభవార్తని చెప్పవచ్చు.

Update: 2022-09-02 15:15 GMT

రైతులకి బంపర్ ఆఫర్.. ఈ స్కీంలో 3 లక్షల ప్రయోజనం..!

Pashu Kisan Credit Card: రైతులకు ఇది శుభవార్తని చెప్పవచ్చు. మీరు పశుపోషణ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల రూపాయల ప్రయోజనం లభిస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా పశుపోషణ చేసే రైతులకు ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ సౌకర్యం కల్పిస్తోంది. ఈ కార్డ్ పేరు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్‌. దీని కింద మీరు రూ.3 లక్షల ప్రయోజనం పొందుతారు.

ఆవు, గేదె, మేకల పెంపకం, చేపల పెంపకం వంటి కార్యకలాపాలు సాగిస్తున్న రైతులందరికీ ప్రభుత్వం ఈ కార్డును అందజేస్తోంది. ఈ పథకం కింద కేంద్రం, రాష్ట్రంలో పశుపోషణను ప్రోత్సహించాలని తద్వారా దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం కొరతను తీర్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో పశువుల యజమానులు రుణం కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పశు కిసాన్ క్రెడిట్ కార్డు కింద అవసరమైనప్పుడు సులభంగా రుణం పొందుతున్నారు. ఇది కాకుండా మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయల ప్రయోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద చాలా మార్పులు చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ పశుపోషణ, మత్స్య సంపదకు కూడా ఆపాదించారు. అంటే పీఎం కిసాన్ సద్వినియోగం చేసుకునే రైతులు కూడా ఈ కార్డుల సదుపాయాన్ని పొందవచ్చు. ప్రస్తుతం పశుపోషకులకు క్రెడిట్ కార్డుల ద్వారా గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. ఈ రంగానికి ఇది గరిష్ట రుణ పరిమితి. ఈ రుణంపై బ్యాంకు 7 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశువుల యజమానులకు సబ్సిడీని కూడా ఇస్తాయి. ఎవరైనా రైతు దీనిపై సబ్సిడీ తీసుకోవాలనుకుంటే ఏడాది గడువులోపు రుణం చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News