30 ఏళ్లుగా ఆకుకూరల సేద్యం.. ఏడాదికి రూ.లక్ష ఆదాయం..

Leafy Vegetables Cultivation: వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసినా పంట కాలం ఎక్కువగా ఉంటుంది.

Update: 2022-02-23 09:00 GMT

30 ఏళ్లుగా ఆకుకూరల సేద్యం.. ఏడాదికి రూ.లక్ష ఆదాయం..

Leafy Vegetables Cultivation: వరి, మొక్కజొన్న ఇలా ఏ పంటలు సాగు చేసినా పంట కాలం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి భారం కూడా పెరుగుతుంది. అందుకే తమకున్న అరెకరం పొలంలో తీరొక్క ఆకుకూరలు ఏళ్లుగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రైతు దంపతులు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో తక్కువ పెట్టుబడితో , నష్టం అనే మాట లేకుండా ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రతి రోజు ఆదాయం పొందుతున్నారు.

మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో ఉపకరిస్తాయి. కంటి చూపుతో పాటు మలబద్ధకం వంటి సమస్యలను ఆకుకూరలు నివారించి మనం ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. మార్కెట్‌లోనూ ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా ఏడాది పొడవునా తీరొక్క ఆకుకూరలు పండిస్తూ రోజువారీ ఆదాయాన్ని పొందుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామానికి చెందిన మిరియాల రాములు ,రమణ దంపతులు. గత 30 ఏళ్లుగా తమకున్న అరెకం విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు.

అరెకరం విస్తీర్ణంలో తోటకూర, పాలకూర, సుక్కకూర, గోంగూర,మెంతి వంటి ఆకుకూరలు పండిస్తున్నారు. ఏడాది పొడవునా ఒక పంట పూర్తికాగానే మరో పంటను సాగు చేస్తున్నారు ఈ దంపతులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొలంలోనే గడుపుతారు వీరు. వీరితో పాటు వీరి కుమారుడు, కోడలు అందరూ కలిసికట్టుగానే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కష్టపడి పొలం పనులు చేసుకుంటూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆకుకూరలను ప్రతి రోజు ఉదయాన్నే కొత్తగూడెం మార్కెట్ కు తీసుకువెళ్లి వ్యాపారులకు విక్రయిస్తుంటామని రైతు చెబుతున్నారు. ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తోందంటున్నారు. ఆకుకూరల సాగుతో పాటు పందిరి కూరగాయలైన పొట్ల, చిక్కుడు, సొర, బీర, దొండ, బెండ, వంగ వంటి కూరగాయలు ఇంటి అవసరాలకు పండించుకుంటున్నారు. 

Full View


Tags:    

Similar News