Indian Railway Jobs 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వే పోస్టులకు 3 ఏళ్ల వయసు పెంపు..!

Indian Railway Jobs 2024: ఇండియన్‌ రైల్వే ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలెట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి మూడేళ్ల వయసు సడలింపు చేసింది.

Update: 2024-01-30 12:00 GMT

Indian Railway Jobs 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రైల్వే పోస్టులకు 3 ఏళ్ల వయసు పెంపు..!

Indian Railway Jobs 2024: ఇండియన్‌ రైల్వే ఇటీవల విడుదల చేసిన అసిస్టెంట్ లోకో పైలెట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి మూడేళ్ల వయసు సడలింపు చేసింది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ల (ALP) భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. రైల్వే నెట్‌వర్క్ విస్తరిస్తున్న కొద్దీ సిబ్బంది నియామకాలు పెరుగుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. గతంలో 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల సడలింపుతో గరిష్ట వయోపరిమితి 33 ఏళ్లుగా మారింది.

ఈ పోస్టుల కోసం జనవరి 31 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. చివరితేదీ 19 ఫిబ్రవరి 2024గా నిర్ణయించారు. వయోపరిమితి జూలై 1, 2024 నుంచి లెక్కిస్తారు. ఇది కాకుండా ALP రిక్రూట్‌మెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల చేరిక వెంటనే జరుగుతుంది. దీని కోసం వారు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ

1. మొదటి దశ CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)

2. రెండవ దశ CBT

3. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లికేషన్ గురించి మాట్లాడితే రూ. 500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. CBT 1 పరీక్షలో పాల్గొన్న వారికి రూ.400 వాపసు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈబీసీ, వికలాంగ కేటగిరీ అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. CBT 1 పరీక్షకు హాజరైన వారికి మొత్తం రూ. 250 తిరిగి ఇస్తారు.

Tags:    

Similar News