Supreme Court Jobs 2022: సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. జీతం నెలకి రూ. 44900..!
Supreme Court Jobs 2022: జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
Supreme Court Jobs 2022: సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. జీతం నెలకి రూ. 44900..!
Supreme Court Jobs 2022: జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు sci.gov.in అధికారిక సైట్‌ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 14 మే 2022గా నిర్ణయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 18 ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభమైంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భారత సుప్రీంకోర్టులో మొత్తం 25 జూనియర్ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేస్తారు.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వయోపరిమితి కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్ 7 కింద నెలకు రూ. 44900 జీతం చెల్లిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కింద అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్ణయిస్తారు. అర్హత గల అభ్యర్థులు 14 మే 2022 వరకు అధికారిక సైట్ sci.gov.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఇతర సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక సైట్‌ని చూడండి.