PNB Recruitment 2024: బ్యాంకు ఉద్యోగమే మీ లక్ష్యమా.. పీఎన్‌బీ అందిస్తోంది సువర్ణవకాశం..!

PNB Recruitment 2024: కొంతమంది నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగం సంపాదించడం లక్ష్యంగా ఉంటుంది.

Update: 2024-02-05 15:00 GMT

PNB Recruitment 2024: బ్యాంకు ఉద్యోగమే మీ లక్ష్యమా.. పీఎన్‌బీ అందిస్తోంది సువర్ణవకాశం..!

PNB Recruitment 2024: కొంతమంది నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగం సంపాదించడం లక్ష్యంగా ఉంటుంది. ఇందుకోసం ఏళ్ల తరబడి ప్రిపేర్‌ అవుతుంటారు. అలాంటి వారికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు సువర్ణవకాశం కల్పిస్తోంది. మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, మేనేజర్ ఫారెక్స్, సీనియర్ మేనేజర్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1025 పోస్టులను భర్తీ చేస్తుంది. అన్ని ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగాలే. అప్లై చేయడానికి అభ్యర్థులు pnbindia.in.అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 7 ఫిబ్రవరి 2024 నుంచి అప్లికేషన్‌ చేసుకోవచ్చు. చివరి తేదీ 25 ఫిబ్రవరి 2024గా నిర్ణయించారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు pnbindia.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా అప్‌డేట్‌ల లింక్‌పై క్లిక్ చేయాలి.

తర్వాత PNB మేనేజర్ ఫారెక్స్ రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌కి వెళ్లాలి.

తదుపరి పేజీలో అడిగిన వివరాలతో నమోదు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.

తర్వాత సమర్పించి ప్రింటవుట్ తీసుకోవాలి.

అర్హత, వయస్సు, జీతం

ఆఫీసర్ క్రెడిట్- PNBలో ఆఫీసర్ క్రెడిట్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా CA ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయస్సు 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ పోస్ట్‌లో ఎంపికైన తర్వాత జీతం రూ. 63,840 నుంచి ప్రారంభమవుతుంది.

మేనేజర్ ఫారెక్స్- పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మేనేజర్ ఫారెక్స్ పోస్ట్ కోసం అభ్యర్థులు MBA డిగ్రీని కలిగి ఉండాలి. దీని కోసం వయస్సు 25 సంవత్సరాల కంటే ఎక్కువ 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఈ పోస్టుకు ప్రారంభ వేతనం రూ.69,810.

మేనేజర్ సైబర్ సెక్యూరిటీ- MCA, BTech లేదా BE డిగ్రీ ఉన్నవారు మేనేజర్ సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 25 నుంచి 35 మధ్య ఉండాలి. ఈ పోస్టుపై వేతనం రూ.69,810 నుంచి ప్రారంభమవుతుంది.

సీనియర్ మేనేజర్- PNBలో సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ పోస్ట్ కోసం అప్లై చేయడానికి అభ్యర్థులు BTech లేదా MCA డిగ్రీని కలిగి ఉండాలి. వయస్సు 27 సంవత్సరాల కంటే ఎక్కువ, 38 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఈ పోస్టుకు ప్రారంభ వేతనం రూ.63,840 నుంచి రూ.78,230 మధ్య ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

అర్హులైన అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇందులో రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు 50 మార్కులకు ఇంటర్వ్యూ రౌండ్‌లో హాజరు కావాలి. మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.

Tags:    

Similar News