Jobs: ITIలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 215 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!!

Jobs: ITIలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 215 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!!

Update: 2026-01-02 04:28 GMT

Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI) యువతకు మరో మంచి అవకాశాన్ని అందిస్తోంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 215 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ITI అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

ఈ నియామకాలు ఇంజినీరింగ్, ఐటీ, మేనేజ్‌మెంట్, సైన్స్ వంటి విభిన్న రంగాలకు సంబంధించినవిగా ఉన్నాయి. పోస్టును బట్టి BE / B.Tech, MSc (ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ), డిప్లొమా, ITI, MBA, MCA, BSc (IT), BCA, BBA, BBM, BMS వంటి అర్హతలు ఉండాలి. కొన్నిపోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా అవసరం అవుతుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నారు. ముందుగా దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం పోస్టును బట్టి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ వంటి దశల ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఈ విధానం ద్వారా ప్రతిభ కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పించడమే లక్ష్యంగా ITI పనిచేస్తోంది.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీకి ముందే అప్లికేషన్ పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువతకు ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు. 

Tags:    

Similar News