Indian Army Agniveer Recruitment 2024: ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌గా చేరండి.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ స్టార్ట్‌ అయింది..!

Indian Army Agniveer Recruitment 2024: ఆర్మీలో చేరాలను యువతకు మరొక అవకాశం వచ్చింది. ఇండియన్ ఆర్మీ 2024 అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది.

Update: 2024-02-09 12:45 GMT

Indian Army Agniveer Recruitment 2024: ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌గా చేరండి.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ స్టార్ట్‌ అయింది..!

Indian Army Agniveer Recruitment 2024: ఆర్మీలో చేరాలను యువతకు మరొక అవకాశం వచ్చింది. ఇండియన్ ఆర్మీ 2024 అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఆసక్తి గల వ్యక్తులు join Indianarmy.nic.inలో అప్లికేషన్‌ చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ నెలవారీ జీతం రూ. 30,000 ఉంటుంది. దాదాపు 25,000 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రాత పరీక్ష ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. తర్వాత ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థుల వయసు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టులకు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, ట్రేడ్స్‌మెన్ పోస్టులకు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లికేషన్‌ ప్రాసెస్‌ పూర్తి చేయడానికి అభ్యర్థులు అవసరమైన పత్రాలు, సమాచారాన్ని అందించాలి. వీటిలో 10వ తరగతి పాస్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే ఈ మెయిల్ ID, వ్యక్తిగత మొబైల్ నంబర్ ఉండాలి. ఇవి కాకుండా JCO/OR నామినేషన్ అప్లికేషన్‌ కోసం నివాస రాష్ట్రం, జిల్లా, తహసీల్/బ్లాక్‌లకు సంబంధించిన వివరాలు అవసరమవుతాయి.

అభ్యర్థులు తప్పనిసరిగా స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫొటో, (10 Kb నుంచి 20 Kb, jpg ఫార్మాట్‌లో) ఒక స్కాన్ చేసిన సంతకాన్ని (5 Kb నుంచి10 Kb, .jpg ఫార్మాట్‌లో) సమర్పించాలి. 10వ తరగతి ఇతర ఉన్నత విద్యా అర్హతల వివరణాత్మక మార్క్‌షీట్‌లు అవసరమవుతాయి. ఇవి నిర్దేశిత వర్గం/ప్రవేశం అర్హత ప్రమాణాల ప్రకారం ఉండాలి.

ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ చేసుకోవడానికి అభ్యర్థులు Indianarmy.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అప్లికేషన్‌ ఫారమ్ ఖచ్చితమైన సమాచారంతో నింపాలి. వారు సూచించిన ఫార్మాట్, పరిమాణం ప్రకారం పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకంతో సహా అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.

Tags:    

Similar News