8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వేతనాలు పెరిగే అవకాశం..!

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి

Update: 2023-02-22 04:30 GMT

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వేతనాలు పెరిగే అవకాశం..!

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పాలి. ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది కేంద్ర ఉద్యోగుల వేతనాలు 44 శాతానికి పైగా పెరగవచ్చని అందరు భావిస్తున్నారు. దీంతోపాటు పాత కమీషన్‌తో పోలిస్తే ఈ పే కమిషన్‌లో చాలా మార్పులు ఉంటాయి. 7వ వేతన సంఘం ప్రకారం ప్రస్తుతం ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 కాగా ఈ వేతనానికి ప్రభుత్వం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేసింది. కానీ దీనిపై చాలా వ్యతిరేకత వచ్చింది.

అయితే కేంద్ర ఉద్యోగుల జీతాన్ని నిర్ణయించడానికి కొన్ని కొత్త స్కేల్స్ ఉపయోగించాలని అప్పట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భావించారు. ఏడవ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ అంశం 2.57 రెట్లు ఉందని ఆ తర్వాత ఉద్యోగుల జీతం 14.29 శాతం పెరిగిందని ఈ పెరుగుదల కారణంగా కనీస వేతనం ఉద్యోగులను రూ.18,000గా నిర్ణయించారు. అదే సమయంలో ఎనిమిదో వేతన సంఘం ప్రకారం ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 రెట్లు ఉండవచ్చని ఆ తర్వాత ఉద్యోగుల జీతం 44.44 శాతం పెరగవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో ఉద్యోగుల కనీస వేతనం నేరుగా రూ.18,000 నుంచి రూ.26,000 వరకు పెరుగుతుంది.

8వ వేతన సంఘం ఎప్పుడు అమలులోకి వస్తుంది?

ప్రస్తుతం ఎనిమిదో వేతన సంఘానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రభుత్వం 2024 సంవత్సరంలో ఎనిమిదవ పే కమిషన్‌ను ప్రవేశపెట్టవచ్చు. దీనిని 2026 సంవత్సరంలో అమలు చేయవచ్చు. దీన్ని అమలు చేయడానికి 2024 సంవత్సరంలో పే కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి త్వరలోనే ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద కానుకను అందించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News