RRB Recruitment 2024: రైల్వేలో నర్స్ జాబ్‌ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ అర్హతలు మీకు ఉన్నాయా..!

RRB Recruitment 2024: నర్సింగ్‌ సేవకి సంబంధించిన ఒక ప్రత్యేక ఉద్యోగం. దీనికి చాలా ఓపిక ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులు చేయాల్సి ఉంటుంది.

Update: 2024-02-06 14:30 GMT

RRB Recruitment 2024: రైల్వేలో నర్స్ జాబ్‌ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ అర్హతలు మీకు ఉన్నాయా..!

RRB Recruitment 2024: నర్సింగ్‌ సేవకి సంబంధించిన ఒక ప్రత్యేక ఉద్యోగం. దీనికి చాలా ఓపిక ఉండాలి. ఇందుకోసం ప్రత్యేక కోర్సులు చేయాల్సి ఉంటుంది. నర్సింగ్‌ కోర్సు చేసిన వారు ప్రభుత్వ, ప్రైవేట్‌, రైల్వే సంస్థలకి సంబంధించిన హాస్పిటల్స్‌లో నర్సుగా కెరీర్‌ ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు రైల్వేలో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరితే ప్రభుత్వ సౌకర్యాలతో పాటు మంచి జీతం పొందుతారు. త్వరలో రైల్వేలో స్టాఫ్ నర్స్ కోసం నోటిఫికేషన్ విడుదలకానుంది. RRB స్టాఫ్ నర్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీని ప్రాసెస్‌ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం.

RRB స్టాఫ్ నర్స్ అర్హత ప్రమాణాలు

గుర్తింపు పొందిన సంస్థ నుంచి B.Sc నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీలో 3 సంవత్సరాల కోర్సు చేసిన అభ్యర్థులు భారతీయ రైల్వేలో స్టాఫ్ నర్సు ఉద్యోగానికి అర్హులు. అభ్యర్థులు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. OBC, OBC, SC, ST, Ex-Serviceman, PWBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలు చెల్లించాలి. సమాచారం ప్రకారం దరఖాస్తు తర్వాత రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కూడా రూ. 250 వాపసు పొందుతారు.

స్టాఫ్ నర్స్ ఎంపిక

స్టాఫ్ నర్స్ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. రెండోది డాక్యుమెంట్ వెరిఫికేషన్. CBTని క్లియర్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. తర్వాత తుది ఎంపిక జాబితాను సిద్ధం చేస్తారు. భారతీయ రైల్వేస్ కింద స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం రాత పరీక్షను కంప్యూటర్ టెస్ట్ మోడ్‌లో నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ, జనరల్ ఎబిలిటీ, జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మైనస్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి ¼ మార్కు తీసివేస్తారు.

Tags:    

Similar News