Canara Bank Recruitment 2022: కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..!
Canara Bank Recruitment 2022: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశమని చెప్పవచ్చు.
Canara Bank Recruitment 2022: కెనరా బ్యాంకులో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..!
Canara Bank Recruitment 2022: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశమని చెప్పవచ్చు. కెనరా బ్యాంక్ డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మీరు ఈ రిక్రూట్‌మెంట్ కోసం 20 మే 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటీసు ప్రకారం కెనరా బ్యాంక్‌లో మొత్తం పోస్టులు 12 ఉన్నాయి.
ఖాళీల వివరాలు
1. డిప్యూటీ మేనేజర్ - 2 పోస్టులు
2. అసిస్టెంట్ మేనేజర్, ఐటీ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 2 పోస్టులు
3. అసిస్టెంట్ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ - 1 పోస్ట్
4. జూనియర్ ఆఫీసర్ - 2 పోస్టులు
5. డిప్యూటీ మేనేజర్ - 2 పోస్టులు
6. అసిస్టెంట్ మేనేజర్ - IT నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ - 1 పోస్ట్
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
డిప్యూటీ మేనేజర్ - కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
అసిస్టెంట్ మేనేజర్ - IT నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ - కనీసం 50% మార్కులతో కంప్యూటర్ సైన్స్‌లో BE లేదా B.Tech.
డిప్యూటీ మేనేజర్ బ్యాక్ ఆఫీస్ - కనీసం 45% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
జూనియర్ ఆఫీసర్ - కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్.
వయస్సు పరిధి
జూనియర్ ఆఫీసర్ - 22 నుంచి 28 సంవత్సరాలు
ఇతర పోస్టులు - 22 నుంచి 30 సంవత్సరాలు
ఎంపిక
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి
కెనరా బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు పోస్ట్ ద్వారా చేయాలి. అభ్యర్థులు రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. దరఖాస్తు ఫారమ్‌ను పంపాల్సిన చిరునామా – జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, మేకర్ ఛాంబర్ III నారిమన్ పాయింట్, ముంబై- 400021.