Railways Jobs 2022: రైల్వేలో బంపర్ రిక్రూట్‌మెంట్‌.. రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!

Railways Jobs 2022: వెస్ట్రన్ రైల్వే 2022-2023 కోసం స్పోర్ట్స్ కోటా కింది విభాగంలో 21 గ్రేడ్ సి పోస్టుల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Update: 2022-08-30 14:29 GMT

Railways Jobs 2022: రైల్వేలో బంపర్ రిక్రూట్‌మెంట్‌.. రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలు..!

Railways Jobs 2022: వెస్ట్రన్ రైల్వే 2022-2023 కోసం స్పోర్ట్స్ కోటా కింది విభాగంలో 21 గ్రేడ్ సి పోస్టుల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా లెవల్ 2, 3, 4, 5 పోస్టులను భర్తీ చేస్తారు. ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లర్క్-కమ్-టైపిస్ట్ కేటగిరీలో నియమించబడే వ్యక్తులు ఆంగ్లంలో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో నిమిషానికి 25 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. నియామకం తేదీ నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో అతను టైపింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు అతని నియామకం తాత్కాలికంగా పరిగణిస్తారు.

లెవల్‌ 4,5 కింద దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అయితే లెవల్‌ 2, 3 కింద దరఖాస్తు చేయడానికి అభ్యర్థి 10+2 లేదా దానికి సమానమైన గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ 5 సెప్టెంబర్ 2022 నుంచి అధికారిక వెబ్‌సైట్ www.rrcwr.com ద్వారా ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. స్పోర్ట్స్ ట్రయల్స్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు రుసుము జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించాలి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వయోపరిమితి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. అదే సమయంలో గరిష్ట వయోపరిమితిని 25 సంవత్సరాలుగా తెలిపారు. వయస్సు 1 జనవరి 2023 నుంచి లెక్కిస్తారు. జీతం లెవల్ 2 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.19900 నుంచి రూ. 63200 వరకు పొందుతారు. లెవల్ 3 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం పొందుతారు. లెవల్ 4 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ. 25500 నుంచి రూ.81100 వరకు జీతం పొందుతారు. లెవల్ 5 కింద ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.29200 నుంచి రూ.92300 వరకు జీతం పొందుతారు.

Tags:    

Similar News