Kalasha Naidu: పదకొండేండ్లకే గౌరవ డాక్టరేట్‌.. కలశనాయుడుకు అరుదైన గౌరవం..

Kalasha Naidu: పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ… వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము…. అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది.

Update: 2024-05-02 09:16 GMT

Kalasha Naidu: పదకొండేండ్లకే గౌరవ డాక్టరేట్‌.. కలశనాయుడుకు అరుదైన గౌరవం..

Kalasha Naidu: పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ… వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము…. అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పలుకుదాం..!

అది ఆగస్టు 13, 2013… తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ… కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది. తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు… ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.

‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం, గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది.

బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ కూడా ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంట్ క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కలశ నాయుడు కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారట. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశమని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నానని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు, ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది. వయస్సు కాదు.. సాయం చేసే హృదయం ముఖ్యమని చెప్పవచ్చు చిన్నారి కలశను చూస్తే. అందుకే కలశకు యావత్ ప్రపంచం అభినందనలు తెలుపుతోంది.

Tags:    

Similar News