ప్రకృతి వ్యవసాయం పరిశిలించిన ఉపరాష్ట్రపతి

Update: 2018-08-23 09:58 GMT

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని,

నర్సింహపాలెంలో ప్రకృతి వ్యవసాయం,

ఎన్నో దాని గురించి తెలుసుకొన్న ఉపరాష్ట్రపతి,

రైతులతో సమావేశమయ్యారు, మన 

అద్బుత వాచస్పతి మన వెంకయ్యగారు.  శ్రీ.కో. 


కృష్ణా జిల్లాలో ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నర్సింహపాలెంలో నాడెప్ కంపోస్టు ద్వారా చేస్తున్న ప్రకతి వ్యవసాయాన్ని వెంకయ్య నాయుడు చాల ఆసక్తిగా పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి  రైతులతో సమావేశమయ్యి వారితో మాట్లాడారు. అక్కడి ప్రకృతి వ్యవసాయం తీరుతెన్నులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాపులపాడు మండలం శేరినరసన్నపాలెంలో జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం, వరిపొలాలను వెంకయ్యనాయుడు పరిశీలించారు. ఉపరాష్ట్రపతి వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ అనురాధ, కలెక్టర్‌ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రంలో.

Similar News