సోమశిల ఆయకట్టు నీటి పంపిణిపై నేడు కీలక నిర్ణయం

Update: 2018-11-08 08:57 GMT

ఏపీలో అతిపెద్ద జలాశయం సోమశిల ఆయకట్టు నీటి పంపిణిపై నిర్ణయం తీసుకునేందుకు నెల్లూరు సాగునీటి సలహా మండలి సమావేశం కాబోతుంది. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు అధ్యక్షతన మంత్రులు అమర్నాథ్ రెడ్డి సారధ్యంలో జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సోమశిల జలాశయం ఆయకట్టు తాగునీటిపై గతంలో ఎప్పుడూ లేనంత విధంగా సందేహాలు మొదలయ్యాయి. అంతంత మాత్రంగానే ఉన్న నీటి నిల్వతో ఆయకట్టుకు ఏ మేరకు నీరందిస్తారన్నది రైతుల్లో ఆందోళన నెలకొంది.. ప్రస్తుతం సోమశిల జలాశయం‌లో 42 టీఎంసీల నీరుంది జలాశయం పూర్తి ఆయకట్టు గతేడాది లెక్కల ప్రకారం 8 లక్షల ఎకరాలకు పై మాట దీంతో నీరందించాలంటే కనీసం మరో 15 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న నీటి మట్టం ప్రకారం 7.5 టీంఎసీల నీటిని  డెడ్ స్టోరేజీగానూ, నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు పట్టణాల తాగునీటి అవసరాల కోసం మరో 6 నుంచి 10 టీఎంసీల నీరు అవసరం. 

ఇలా లెక్కిస్తే ఉన్న 42 టీఎంసీల్లో దాదాపు 15 టీఎంసీల నీరు  ఇతర అవసరాలకు సరిపోతోంది. అంటే మిగిలిన 27 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. నవంబర్ మాసాంతం, ఈశాన్య రుతుపవనాలు, తుపాన్ల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముంన్నందున మరో 12 టీఎంసీల నీటిని అందుబాటయ్యే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ లెక్కన మొత్తం డెల్లా మొదటి హక్కు ద్వారా 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు, కావలి, ఉత్తర, దక్షిణ కాలువలు మరో లక్ష ఎకరాలు ఇలా మొత్తం మూడున్నర లక్షల ఎకరాలకు నీరందించే అవకాశమున్నట్లుగా అధికారులు ప్రాధమిక అంచానాల్లో ఉన్నారు.. 

అయితే మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. వారి డిమాండ్లను నెరవేర్చాలంటే నీరు సరిపోయే అవకాశాలు లేవు.. అందుకోసం మూడు రోజుల క్రితం సోమశిల ప్రాజెక్టు చైర్మన్ తో టీడీపీ నేతలు భేటీ అయ్యారు.. ఇందులో అధికారలు లెక్కల ప్రకారం తాగునీటి అవసరాలకు పోను, రానున్న రెండు నెలల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని 3.5 లక్షల ఎకరాలకు నీరందించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.. దీనిని రైతులతో ఒప్పించే ప్రయత్నాల్లో అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.. దీనిని ఆయకట్టు రైతులు ఏ మేరకు అంగీకరిస్తారనేది సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ.

Similar News