ఆలయంలోకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యే.. గంగా జలంతో శుద్ధి చేసిన గ్రామస్థులు

Update: 2018-08-01 03:56 GMT

ఓ మహిళా ఎమ్మెల్యే  ఆలయంలోకి వెళ్లి పూజలు చేసిందని.. ఆలయాన్ని కడిగి శుద్ధి చేశారు కొందరు  గ్రామస్థులు ఈ ఘటన యూపీలోని హమీర్పూర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని రాత్ నియోజకవర్గ ఎమ్మెల్యే మనీషా.. ముష్కర ఖుర్ద్ అనే గ్రామానికి వెళ్లారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో   పాల్గొని అనంతరం గ్రామంలో ఉన్న ధూమ్ర రుషి ఆలయంలోకి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్నారు. ధూమ్ర రుషి.. ఆయనను మహాభారత కాలానికి చెందిన దేవుడుగా భావిస్తారు. ఆ సమయంలోనే ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారని గ్రామస్థుల అభిప్రాయం. ధూమ్ర రుషి కళ్లెదుట మహిళలు ఉంటే.. ఊరికి అరిష్టమని భావిస్తారు స్థానికులు. ఈ విషయం తెలియని ఎమ్మెల్యే ఆలయంలోకి  వెళ్లి పూజలు చేశారు. దీంతో తమ గ్రామానికి అరిష్టంగా  భావించారు. వెంటనే గ్రామ పంచాయతీ సమావేశం అయ్యి.. గంగా జలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఆలయ శుద్ధిపై ఎమ్మెల్యే అనురాగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పని మహిళలను అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు.

Similar News