“శివ” అంటే వీడే !

Update: 2018-11-16 09:27 GMT

శివ చిత్రం .. తెలుగు సినిమా చరిత్రలోనే... ఒక కొత్త పంథాని నిర్మించిన చిత్రం...ఇది మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ళ మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన ప్రతినాయకుడుగా, అతని సహచరుడుగా తనికెళ్ళ భరణి నటించారు. భరణి సంభాషణలు కూడా అందించారు. సీఎన్ఎన్-ఐబిఎన్ రూపొందించిన భారతదేశ 100 ఉత్తమ చిత్రాలలో శివ కూడా ఒకటి. ఇళయరాజా స్వరాలని కూర్చారు. రాంగోపాల్ వర్మకి దర్శకుడిగా ఇది తొలి చిత్రం. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో 1990 లో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో చూపిన కళాశాల ప్రాంగణం సికింద్రాబాద్ లోని కీస్ ఉన్నత పాఠశాలది. మీరు ఇప్పటి వరకు ఈ సినిమా చూడకుంటే మాత్రం తప్పక చూడండి. శ్రీ.కో.
 

Similar News