ఊర్వశి శారద.. నట విశారద

Update: 2018-12-01 07:12 GMT

ఊర్వశి శారదగా మనందరికీ పరిచయమున్న తాడిపర్తి శారద  తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనది.   బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మూడు సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందినది. చిన్నతనం నుంచి ఈవిడకు వారి కుటుంభ సభ్యులు భరత నాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్ళి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళఅమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు. రక్త కన్నీరు’ నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణంగారి పక్కన హీరోయిన్ వేషం. అక్కడి నుండి అలా ఎదుగుతూ సినిమా ఆకాశంలో ఒక తారల నిలిచింది. శ్రీ.కో.

Similar News