ఏటిఎం కార్డు చూసుకో నాయన!

Update: 2018-08-16 10:06 GMT

డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత ఏటిఎం లలోనట,

మ్యాగ్నెటిక్‌ స్టిప్‌ కలిగిన ఎస్బీఐ  ఏటిఎం కార్డులు,

పనిచేయవని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెప్పెనట, 

ఈఎంవీ (చిప్‌) కార్డులను ప్రవేశపెట్టబోతున్నరట. శ్రీ.కో. 


ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ తర్వాత మ్యాగ్నెటిక్‌ స్టిప్‌ కలిగిన తమ ఏటిఎం కార్డులు పనిచేయవని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తెలిపింది. అటువంటి కార్డులు కలిగిన ఖాతాదారులు వెంటనే వాటిని మార్చుకుని చిప్‌ కార్డులు తీసుకోవాలని సూచించింది. ఏటిఎం ద్వారా జరుపుతున్న లావాదేవీలను మరింత సురక్షితం చేయడంలో భాగంగా రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బిఐ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో భాగంగానే మ్యాగ్నెటిక్‌ స్టిప్‌ కలిగిన కార్డులను రద్దు చేసి ఈఎంవీ (చిప్‌) కార్డులను ప్రవేశపెట్టబోతున్నట్లు పేర్కొంది. వీటి కోసం ఈ ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ లోగా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని ఎస్‌బిఐ ఖాతాదారులకు విజ్ఞప్తి చేసింది.

Similar News