కొత్త చిత్రం సవ్యసాచి సినిమా రివ్యూ

Update: 2018-11-02 09:22 GMT

కొత్తదైన ఆలోచనతో ..వచ్చిన కొత్త చిత్రం సవ్యసాచి.  సినిమా.. కి మూలం...‘మేధావి తన తెలివిని మంచి కోసం వాడాలి కానీ, వినాశనం కోసం కాదు.. అలాంటి మేధావితనం అతన్నే నాశనం చేస్తుంది’ . ఈ ఆలోచనకి  మంచి కథనం తోడై ఉంటే ఇంకా ఎంతో మేరుగై వుండేది ఈ సినిమా. ప్రతీకారం అనే భావాన్ని సినిమాగా చేసిన థ్రిల్లింగ్ డ్రామా ‘సవ్యసాచి’. ఇందులోని  ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే విషయము మూలంగా ..కథ కొంత ఫ్రెష్ గా అనిపించింది.  వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనేతే....తల్లి గర్భంలో ఏర్పడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోయే ఒక లోపం ఇది.... ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) పుడతాడు. అలా మన హీరో అయినా....విక్రమ్ ఆదిత్య ఒకరు కాదు.. అతనిలో ఆదిత్య రెండో వ్యక్తి. అతను బయటికి కనిపించకపోయినా న్యూరాన్ల రూపంలో విక్రమ్ మెదడు, ఎడమ చేతిలో దాగి ఉంటాడు. అతనికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని విక్రమ్ ఎడమచేతితో చూపిస్తుంటాడు.  ఆ విదంగా ఈ సినిమాకి సూపర్ హీరో ఎడమచేతి అని చెప్పవచ్చు.  కథనం జాగ్రత్త తీసుకుంటే...బాగా నడిచే సినిమా ఇది...కాని ఏందో ..నిర్మాతలు కానీ...దర్శకుడు కానీ కథనం మీద సమయాన్ని పెట్టుబడిగా పెట్టలేదనిపించింది. శ్రీ.కో.

Similar News