అంతా తూచ్‌... మేమంతా ఒక్కటే. మారిన కర్నాటకం

Update: 2018-05-16 06:53 GMT

కర్ణాటకలో రాజకీయాలు క్షణం క్షణం మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త దూరంలో నిలిచిపోయిన బీజేపీ...జేడీఎస్‌‌పై  చీలికాస్త్రాన్ని ప్రయోగిస్తోంది. దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణకు పదవుల విసురుతోంది. ఇన్ని రాజకీయాల మధ్య  జేడీఎస్‌కు దేవెగౌడ పెద్ద కొడుకు జలక్ ఇస్తాడా అనేది ఉత్కంఠకు తెరపడింది.

ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్‌కు కొంచెం దూరంలో బీజేపీ ఆగిపోవడంతో.. కాంగ్రెస్ చక్రం తిప్పి కుమారస్వామి సీఎం అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది. జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని అదికూడా ఎలాంటి షరతులు లేకుండా ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. కుమారస్వామి కూడా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. కింగ్ మేకర్ అనుకున్న జేడీఎస్ అధినేత కుమారస్వామి ఏకంగా కింగ్‌గా మారి కుర్చి ఎక్కబోతున్నారు. దీనికి మేమంతా ఒక్కటేనని రేవణ్ణ కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పేశాడు. 

Similar News