రక్తసంబంధం సినిమా

Update: 2018-11-04 10:10 GMT

రక్తసంబంధం 1962లో విడుదలైన తెలుగుచిత్రం. వి.మధుసూదనరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, సావిత్రి (నటి) ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ సినిమాను డూండీ నిర్మాణం చేశారు. తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించగా విజయవంతమైన పాశమలర్ దీనికి మాతృక.. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం "హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు" అంటూ ప్రోత్సహించారు. ఆ తర్వాత ఈ సినిమా ఒక సూపర్ హిట్ సినిమాగా నిలబడింది. సమయం చిక్కితే తప్పక చూడాల్సిన సినిమా ఇది. శ్రీ.కో.

Similar News