గురువారం ఉదయం ఎన్ని- కలలో

Update: 2018-08-08 12:13 GMT

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికై ఇక నిలిచే,

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ వలచే,

ఎంపీ బీకే హరిప్రసాద్‌ , తను బరిలోకి దిగుటచే,

గురువారం ఉదయం కొరకు అంతా వేచే! శ్రీ.కో

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ఎంపీ బీకే హరిప్రసాద్‌ బరిలోకి దిగుతున్నారు. అభ్యర్థి ఎంపిక విషయమై మంగళవారం ప్రతిపక్షాలు మరోసారి సమావేశమయ్యాయి. డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ సుముఖత చూపించలేదు. ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కు అప్పగించడంతో.. ఆ పార్టీ హరిప్రసాద్‌ పేరును ఖరారుచేసింది. దీంతో బుధవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ కూడా నామినేషన్ వేశారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన హరిప్రసాద్‌ ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి ఆగస్టు 9న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఇటీవల రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నంతో నామినేషన్ గడువు ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు.

Similar News