సంచలన నిర్ణయం దిశగా RSS అడుగులు.. రాహుల్ గాంధీని..

Update: 2018-08-28 03:33 GMT

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(RSS) మరోసారి సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, RSS నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో… ఓ సంచలన విషయం బయటకు వచ్చింది.సెప్టెంబర్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి రాహుల్‌గాంధీని పిలవాలని యోచిస్తోంది. అంతేకాదు కరుడుగట్టిన కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరిని కూడా ఆహ్వానించాలని RSS యోచిస్తోంది. మహాత్మాగాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇందులో రాహుల్‌గాంధీ కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించాలని చూస్తున్నాయని ఇటీవల లండన్‌లో కూడా రాహుల్ విమర్శలు గుప్పించారు. రాహుల్ కు  RSS ఆశయాలు సిద్ధాంతాలు స్వయంగా తెలియజూపించాలనే అభిప్రాయంలో RSS ఉందట. ఇందులో భాగంగానే రాహుల్ ను తమ సభలకు ఆహ్వానించాలని RSS భావించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాకపోయినా తుది నిర్ణయం మోహన్ భగవత్ దేనని వారు అంగీకరిస్తున్నారు. ఇదిలావుంటే కొద్దిరోజుల క్రితం నాగపూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమానికి కరడుగట్టిన కాంగ్రెస్‌ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరవ్వడం… దేశ రాజకీయాల్లో కలకలం సృష్టించింది

Similar News