పుష్పక విమానం సినిమా

Update: 2018-10-23 11:54 GMT

కొన్ని సినిమాలు చాల ప్రత్యేకంగా నిర్మించ బడుతాయి.. అలా నిర్మించబడిది పుష్పక విమానం  అనే సినిమా.. తెలుగులో పుష్పక విమానం గానూ, మిగిలిన భాషలలో పుష్పక్ గానూ  విడుదల చేయబడిన ఈ చిత్రం సంభాషణలు లేకుండా కేవలం వాద్య సంగీత సహకారంతో నిర్మింపబడినది. ఈ సినిమా ఒక రోజు రాజుగా  అనే కథను మూలంగా బెంగలూరు నగరాన్ని నేపథ్యంగా తీసుకొని నిర్మింపబడినది. ఇది సంభాషణలు లేని సినిమా. కనుక ఏ భాషకైనా చెందవచ్చును. ఈ సినిమా చిత్రీకరణ కలరులో సంభాషణలు లేకుండా అవసరానికి తగిన శబ్ధాల సహకారంతో తీయబడింది. ఈ చిత్రంలో సంభాషణలు లేవు. కానీ పూర్వపు మూకీ చిత్రాల్లో లాగా పాత్రలు పెదవులతో మాటలు పలికించడం లేదు. అందుకు భిన్నంగా ఈ చిత్రంలో సంభాషణలకు తావిచ్చే సన్నివేశాలను తప్పించి, సన్నివేశంలో సంభాషణలు వినిపించేందుకు వీలుకాని విధంగా కెమెరాను అమర్చి ఛాయాగ్రహణపు యుక్తితో మూకీని సాధించారు. మీరు ఇప్పటి వరకు చూడకుంటే తప్పక చూడాల్సిన సినిమా. శ్రీ.కో.

Similar News