కలెక్షన్ల అభిషేకం, ప్రేమాభిషేకం

Update: 2018-10-01 11:27 GMT

అన్నపూర్ణ స్టూడియోస్  వారి ప్రేమాభిషేకం 10 కేంద్రాల్లో 300 రోజులు నడిచి అప్పట్లో అపూర్వమైన రికార్డు సాధించిన చిత్రం. ఈ సినిమా కథ, మాటలు,పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని తన బుజాలపై వేసుకొని నడిపించారు  దాసరినారాయణరావు. అలాగే  అక్కినేని నాగేశ్వరావు ,శ్రీదేవిల అద్బుత నటన, మిగిలిన ఇతర నటులైన  మురళీమోహన్, మోహన్ బాబు, గుమ్మడి, ప్రభాకరరెడ్డి,పద్మనాభం, ఈశ్వరరావు, ప్రత్యేక పాత్రలో: జయసుధ బాగా మెప్పించారు. ఈ చిత్రం సాధించిన రికార్డులు అపురూపం. విడుదలైన అన్ని థియేటర్లలో 50 రోజులు దాటి ఆడడం ఒక ప్రత్యేక విషయం. అలాగే వందరోజులతో 30 కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకోవడమేగాక 29కేంద్రాల్లో రజతోత్సవం చేసుకున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది.  ఆనాటి శతదినోత్సవ వేడుకలను చిత్రీకరించి తర్వాత ఆ సినిమా నడుస్తున్నకేంద్రాలలో ప్రదర్శించారు. ఒకచిత్రం శతదినోత్సవ వేడుకలను అదే చిత్రం ఆడుతున్న కేంద్రాల్లో ప్రదర్శించడం ఒక అరుదైన సంఘటన. ఈ చిత్రం 12 కేంద్రాల్లో 250 రోజులు నడిచి నిర్మాతలకి కలెక్షన్ల అభిషేకం చేసింది. శ్రీ.కో.
 

Similar News