నామినేటెడ్ పదవి ద్వారా మంత్రిగా అధికారాన్ని అనుభవిస్తూ తమపై విమర్శలు చేయడం మంత్రి నారా లోకేష్ కు తగదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడి గెలవాలని మంత్రి నారా లోకేశ్‌కు పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గెలుస్తాడన్న నమ్మకం లేకే చంద్రబాబు లోకేశ్‌ని దొడ్డి దారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. విశాఖ జిల్లా పెదరుషికొండ ఐటీ సెజ్ ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన జనసేన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అడుగడుగునా సమస్యలు నెలకొన్నా పరిష్కారం చూపే దిక్కులేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు