రైలు ముచ్చట "తూచ్చు"

Update: 2018-07-30 08:08 GMT

ఆంధ్రప్రదేశ్లో రైల్వేజోన్ కదలిక,

ఇక లేదని తెలిపిన హోంశాఖ,
 
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి,
 
పెట్టను మెలిక, ఆ"హోమ్" శాఖ. శ్రీ.కో

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే జోన్‌, తెలంగాణలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధ్యం కావని కేంద్ర హోంశాఖ అభిప్రాయపడింది. హోంశాఖ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమయినట్టు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతలోనే టాస్క్‌ఫోర్స్‌ అందుకు భిన్నమైన వాదన వినిపించింది. ఈ ఏడాదిలో వివిధ మంత్రిత్వశాఖలతో మూడు దఫాలు నిర్వహించిన సమావేశాల్లో విభజన చట్టం అమలు వ్యవహారాలు పర్యవేక్షించామని, దీనికి, తెలంగాణ అధికారులు హాజరయ్యారని చెబుతూ సమావేశాల మినిట్స్‌ను కోర్టుకి అందజేసింది. టాస్క్‌ఫోర్సు సమావేశం చర్చలో “దేశంలో 16 రైల్వేజోన్లు ఉన్నాయని, కొత్త జోన్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని” అభిప్రాయపడినట్టు తెలిపింది.

Similar News