కోడి లేకుండానే కోడికూర తినేయొచ్చు.. శాస్త్రవేత్తల ప్రయోగం సక్సెస్..

Update: 2018-10-17 09:24 GMT

మీకు కోడి కూర తినాలనిపిస్తుందా.. అయితే షాపుకు వెళ్లి కోడి తేనక్కర్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవల జరిపిన పరిశోధనలో అసలు.. కోడి లేకుండానే చికెన్ ఆరగించేయొచ్చని చెబుతున్నారు. తద్వారా జీవహింసకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఐదుగురు శాస్త్రవేత్తలు కోడి రెక్కల కణాల నుంచి మాంసం ముక్కలను అభివృద్ధి చేశారు. ఆ ముక్కలను వండిన అనంతరం వాటి రుచి అచ్చం కోడికూర లాగే ఉందని గుర్తించారు. అంతేకాకుండా ఇదే తరహా ప్రయోగం చేపలు మరియు ఇతర జంతువుల సజీవ కణాలపై కూడా చేశారు. వీటి మాంసాన్ని కూడా ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేయవచ్చునని శాస్త్రవేత్తలు గ్రహించారు. దాంతో మాంసాహారం తినాలని కోరికతో ఉండి.. జీవహింస చేయకూడదని అనుకునేవారికి ఈ పద్ధతి సరైనదని వారు సూచిస్తున్నారు.

Similar News