కాబోయే ప్రధానిపై బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-12-26 08:40 GMT

2019లో భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి ఏవరనే విషయంపై యోగా గురు బాబా రామ్‌దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తోందో చేప్పే పరిస్థితి లేదని రామ్ దేవ్ బాబా స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి ఎవరనే విషయం అంచన వేసే పరిస్థితి లేదని బాబా రామ్ దేవ్ అన్నారు. రామేశ్వరంలో ఏర్పాటుచేసిన భారత్ స్వాభిమాన్ సమావేశంలో హాజరుకావడానికి వచ్చిన రామ్ దేవ్ మీడియా సమావేశం మాట్లాడారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వబోనని, వ్యతిరేకించబోనని బాబా రామ్ దేవ్ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయంగా ఎంతో అనిశ్చితి నెలకొని వుందని, బీజేపీ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? అని మాత్రం చెప్పలేకపోతున్నానని బాబా రామ్ దేవ్ అన్నారు. యూపీఏ, ఎన్డీయే పార్టీలు మాత్రం తమ సర్వ శక్తులనూ ఒడ్డి పోరాడనున్నాయని మాత్రం చెప్పగలనని రామ్ దేవ్ అన్నారు.

Similar News