మధ్యప్రదేశ్‌ కే కడక్‌నాథ్‌

Update: 2018-04-06 09:48 GMT

నల్లకోడి ఎటువైపో తేలిపోయింది. కడక్‌నాథ్‌ కోడి ఎవరిదో ఫైనల్ అయ్యింది. యేళ్ల తరబడి సాగుతున్న ఈ వివాదానికి ముగింపు పడింది. నల్లకోడి మధ్యప్రదేశ్ కే చెందుతుందని భారత భౌగోలిక గుర్తింపు సంస్థ ప్రాథమికంగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విరివిగా కనిపించే నల్లకోడిపై వివాదం తేలిపోయింది. తమదంటే తమదని గతకొన్నేళ్లుగా ఈ రెండు రాష్ట్రాలు వాదించుకుంటూ వస్తున్న నేపథ్యంలో భౌగోలిక గుర్తింపు సంస్థ విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చింది. 

మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ ఘఢ్  విడిపోవడంతో ఈ కోడి ఎవరిదనే దానిపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రేగింది. దీంతో చెన్నైలోని భౌగోలిక గుర్తింపు కార్యాలయం కడక్‌నాథ్‌ మధ్యప్రదేశ్‌కే చెందుతుందని ప్రాథమికంగా నిర్ధారించింది. మధ్యప్రదేశ్ జుబువా జిల్లాకు చెందిన గ్రామీణ వికాస్ ట్రస్ట్  దరఖాస్తును ఆమోదించి 1999 జియలాజిక్‌ ఇండికేషన్స్‌ ఆఫ్‌ గూడ్స్‌ చట్టం కింద గుర్తింపు ఇచ్చినట్లు ప్రకటించింది. అయితే దీనిపై మూడు నెలల్లోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే జుబువాకు చెందిన గ్రామీణ వికాస్‌ ట్రస్ట్‌కు కడక్‌నాథ్‌ గుర్తింపును శాశ్వతంగా ఖరారు చేయనున్నారు. 

Similar News