హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు

Update: 2018-10-19 03:25 GMT

గుంటూరు ఎంపీ, సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్నాడు. అతను హీరోగా, కన్నడ నటి నభా నటేష్ హీరోహీరోయిన్ గా 'అదే నువ్వు అదే నేను' అనే చిత్రం ప్రారంభమైంది. ఈ మూవీకి శశి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ ఉన్న నిర్మాత దిల్‌ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. హిప్ హాప్ త‌మీజా ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రొమాంటిక్ ఎంటైర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దసరా సందర్బంగా గురువారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి సూపర్‌స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మంజుల, నిర్మాత దిల్‌రాజు, ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Similar News