కంటతడిపెట్టిన మాజీమంత్రి మోత్కుపల్లి...

Update: 2017-12-21 08:17 GMT

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కంటతడి పెట్టారు. కేసీఆర్‌ ఎస్సీలను నియంతృత్వ పోకడలతో అణిచివేస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. గురువారం ఆయన ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మౌనదీక్షకు దిగారు. ఎస్సీ వర్గీకరణలో జాప్యాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మందకృష్ణను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. తాము కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని, ఆయన తమను అణగదొక్కాలని చూస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేసీఆర్‌ ఎప్పుడు తీసుకెళతారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే మందకృష్ణను విడుదల చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.
 

Similar News